Ad Code

ప్రకాశం బ్యారేజీ వద్ద జల కళ - సందర్శకుల సెల్ఫీల సందడి


శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 3,10,088 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,768 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరదనీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 33.56 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల నుంచి 3.71లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గత రెండ్రోజులతో పోలిస్తే నీటి విడుదల ఎక్కువైంది. కృష్ణమ్మ జలసవ్వడి, నీటి ఉద్ధృతిని వీక్షించేందుకు సందర్శకులు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటున్నారు. సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu