బంగ్లాదేశ్ లో కొత్తగా ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్తారని షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజెద్ జాయ్ అన్నారు. 'ప్రస్తుతానికి ఆమె భారత్ లో ఉన్నారు. ఎన్నికలు నిర్వహించాలని మధ్యంతర ప్రభుత్వం నిర్ణయిస్తే తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తారు. ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. మేము గెలవొచ్చు కూడా'' అని అన్నారు. అమెరికాలో నివసించే సాజీబ్ వాజెద్ జాయ్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని అన్నారు.
0 Comments