ఉత్తరప్రదేశ్ లో హిందూ రక్షా దళ్ (హెచ్ఆర్డీ) కార్యకర్తలు, వారి నాయకుడు భూపేందర్ తోమర్ అలియాస్ పింకీ చౌదరి నేతృత్వంలో మూక రెచ్చిపోయింది. గుల్ధార్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఘజియాబాద్ లోని కేవీ నగర్ ప్రాంతంలో మైనారిటీ వర్గానికి చెందిన నివాసితులపై దాడి చేసింది. దాడికి సంబంధించిన రెండు వీడియోలలో వారి ఆ మూక అకృత్యాలు కనిపించాయి. సదరు హిందూత్వ సంస్థ సోషల్ మీడియా ఖాతాలలో ఇది మొదట ప్రసారం చేయబడింది. ఈ దాడుల్లో అప్రమత్తమైన వ్యక్తులు గుడారాలను ధ్వంసం చేయటం, నివాసితుల వస్తువులను తగులబెట్టడం, నిరంతర మతపరమైన దూషణలను చేస్తూ మైనారిటీ ప్రజలపై లాఠీలతో దాడి చేశారు. ఈ వారంలో ఈ బృందం జరిపిన రెండో దాడి కావటం గమనార్హం. విధ్వంసకులు మురికివాడను కాల్చివేయటమే కాకుండా, మైనారిటీలు అని నిర్ధారించుకున్న తర్వాత వారు ఎంచుకున్న ప్రజల బట్టలు, వస్తువులను హిందూత్వ కార్యకర్తలు కాల్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చిన తర్వాత ఈ దాడులు జరగటం గమనార్హం. ఇలా పిలుపునిచ్చిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే, మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఉన్నారు. కాగా, బంగ్లాదేశ్ లోని అశాంతిపై భారత్ లోని హిందూత్వ శక్తులు, బీజేపీ అనుబంధ శ్రేణులు, సంస్థలు రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేస్తున్నాయి. భారత్ లో ఒక వర్గంపై ద్వేషం పెరిగేలా పోస్ట్ లను చేస్తున్నాయి. దీంతో ఇలాంటి వాటిపై పోలీసులు, స్థానిక యంత్రాంగం దృష్టిని సారించి వాటికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని సామాజిక కార్యకర్తలు, మేధావులు సూచిస్తున్నారు.
0 Comments