ఈరోజుల్లో స్కూల్‌కి వెల్లే చిన్నారుల నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ యూట్యూబ్‌తో కుస్తీలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్‌కు అతుక్కుపోతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చిన్నారులు సైతం గంటలతరబడి స్మార్ట్ ఫోన్‌తో గడుపుతున్నారు. దీంతో ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతోంది. వెన్నునొప్పి మొదలు కంటి సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అయితే యూట్యూబ్ చూసే సమయాన్ని రిస్ట్రిక్ట్ చేసే ఉద్దేశంతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. స్లీప్ టైమర్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్లు య్యూటూబ్ వీడియోలో స్లీప్ టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో మీ స్క్రీన్ టైమ్‌ను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు వీడియో చూస్తున్న సమయంలో యాప్ క్లోజ్ చేయకుండా అలాగే నిద్రపోతే ముందుగా సెట్ చేసుకున్న సమయానికి వీడియో దానంతటదే ఆగిపోయేలా సెట్ చేశారు. దీంతో స్మార్ట్ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించవచ్చు. టైమర్ సెట్టింగ్‌లో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాల ప్లేబ్యాక్ పాజ్ ఆప్షన్‌ను తీసుకురానున్నారు. అయితే టెస్టింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉంది. పూర్తి స్థాయిలో టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఆప్షన్‌న్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే. ఇందుకోసం యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం వీడియో ప్లే చేస్తున్న సమయంలో సెట్టింగ్స్‌లోకి టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌కు యాక్సెస్ పొందాలంటే యాప్‌లో సైన్ ఇన్ అయి ఉండాలి.
0 Comments