రాజస్థాన్ లోని నౌగర్ లో నహర్ సింగ్ పురా గుండా గ్రామంలో జరిగిన ఒక సంఘటన వైరల్ గా మారుతున్నది. ప్రేమా రామ్ మేక్ వాల్ అనే వ్యక్తి తన భార్యతో ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేవారట. తాగి వచ్చి చాలా రచ్చ చేసే వారిని దీంతో పది నెలల క్రితం ఒక మహిళను 2 లక్షల రూపాయలకి కొన్నాడట. దీంతో తన భార్యను ప్రతిరోజు కూడా టార్చర్ పెట్టేవారట. అంతేకాకుండా చాలా హీనంగా ఆమె పైన బరితెగించే వారిని అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా తన భార్యను బైక్ కు కట్టేసి గ్రామంలో ఈడ్చుకుంటూ వచ్చిన సంఘటన ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే అక్కడున్న వారందరూ కూడా అతడిని ఆపి ప్రయత్నం మాత్రం అసలు చేయకుండా చూస్తూ ఉండిపోయారు. ఆ మహిళ కాపాడండి అంటూ అరుపులు కేకలు పెట్టినప్పటికీ కొంతమంది ఈ వీడియోని సీక్రెట్ గా తీసి మరి సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. చివరిగా ఆమెను ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి వదిలేసినట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు పని ఎందుకు అదుపులోకి తీసుకున్నారు.ఈ వీడియో చూసిన పలువురు నేటిజన్ సైతం ఆ వ్యక్తి పైన ఫైర్ అవుతున్నారు.. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
0 Comments