Ad Code

అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై వరి విత్తనాలు !


ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సచివాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటామన్నారు. ఈ సమావేశలో అధిక వర్షాలతో నష్టపోయిన రైతుల గురించి మాట్లాడారు. అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల అధిక వర్షాలు వరినారు, నారుమళ్లు నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వర్షాల వల్ల రాష్ట్రంలోని అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33వేల హెక్టార్లలో వరినారు మళ్లు దెబ్బతిన్నాయని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పారు. ఇలా నారు, నారుమళ్లు నష్టపోయిన రైతుల కోసం 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. బాధిత రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ వరి విత్తనాలు పొందాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఛీ కొట్టినా వైసీపీ అధినేత జగన్ తన బుద్ధి మార్చుకోవడం లేదన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్‌ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏదో తప్పులు జరుగుతున్నాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. గత పాలనలో ప్రతిపక్ష పాలకులపై ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉండేవని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లలో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడింది ఎవరో జగన్ చెప్పాలన్నారు. అలాగే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఎమ్మెల్యేగా కూడా గెలపించరని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu