Ad Code

70 రోజుల వ్యాలిడిటీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.197 రీఛార్జ్‌ ప్లాన్‌ ?


బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.197 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ముఖ్యంగా సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ రీఛార్జ్‌ ప్లాన్ ఉపయోగపడుతుంది.ఈ ప్లాన్ లో మొదటి 15 రోజులపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. తొలి 15 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా SMS ప్రయోజనాలను పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సర్వీసులను ప్రారంభించనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు కేంద్ర మంత్రి జోతిరాధిత్య సింధియా ఇప్పటికే వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2024 అక్టోబర్‌ చివరి నాటికి 80,000 టవర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2025 మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవలు ప్రారంభం కానున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌ నాటికి మరిన్ని ప్రాంతాల్లో 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకురానుందని తెలిపింది. గ్రామాల్లోనూ 4G సర్వీసులు అందించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సెప్టెంబర్‌ నెల చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 4G ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు 4G సిమ్‌ కార్డులకు అప్‌గ్రేడ్‌ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటోంది. అనేక ప్రాంతాల్లో 4G సిమ్‌ కార్డులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే 5G సిమ్‌ కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 5G సిమ్‌ కార్డులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu