Ad Code

రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ వాచ్‌ విడుదల !


దేశీయ మార్కెట్లో రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ వాచ్‌  లాంచ్‌ అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌ జింక్‌ అల్లాయ్ మెటల్‌తో కూడిన బాడీని కలిగి ఉంది. IPX8 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది. సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 18 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 320 x 385 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 2 అంగుళాల దీర్ఘచతురస్రాకార LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 500 నిట్స్‌గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 140 స్పోర్ట్స్‌ మోడ్స్‌, 200 వాచ్‌ ఫేస్‌లను సపోర్టు చేస్తుంది. IPX8 రేటింగ్‌తో వాటర్‌ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. ఇది షియోమీ HyperOS  పైన పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌, iOS స్మార్ట్‌ఫోన్‌లను సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ఇన్‌బిల్ట్‌ వాయిస్‌ యాక్టివేటెడ్‌ అసిస్టెంట్‌ అలెక్సాను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ హిందీ భాషను కూడా సపోర్టు చేస్తుంది. ఇది హెల్త్‌ ట్రాకర్లను కలిగి ఉంది. హార్ట్‌ రేట్‌, SpO2 స్థాయి, సహా నిద్రకు సంబంధించిన నాణ్యత, ఇతర వివరాలను అందిస్తుంది. మహిళల్లో రుతుక్రమాన్ని గురించిన సమాచారం అందిస్తుంది. ఎంఐ ఫిట్‌నెస్‌ యాప్‌ ద్వారా ఈ వివరాలు తెలుసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ బ్లూటూత్‌ 5.3 ను సపోర్టు చేస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా నేరుగా వాచ్‌ నుంచే కాలింగ్‌ చేయడం సహా ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు స్పందించవచ్చు. ఈ వాచ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో కూడిన మూడు మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది. 470mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సంస్థ చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 18 రోజులపాటు వినియోగించుకోవచ్చునని చెబుతోంది. ఎక్కువ ఫీచర్‌లను వినియోగించిన సమయంలో సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా గరిష్ఠంగా 12 రోజుల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. రెడ్‌మి వాచ్‌ 5 యాక్టివ్‌ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.2799 గా ఉంది. సెప్టెంబర్‌ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, షియోమీ ఆఫ్‌లైన్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ మ్యాటీ సిల్వర్‌, మిడ్‌నైట్‌ బ్లాక్ రంగుల్లో లభించనుంది.

Post a Comment

0 Comments

Close Menu