వివో గత జూన్ నెలలో ఆవిష్కరించిన వివో వై58 5జీ ఫోన్‌ను 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ మీద పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా యూనిట్ తో వస్తున్న వివో వై58 5జీ ఫోన్ సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తోంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ మీద లభిస్తున్న ఈ ఫోన్ ధర తగ్గించింది. వివో వై58 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,499లకు లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, దేశవ్యాప్తంగా భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వివో వై58 5జీ ఫోన్ ఆవిష్కరణ సమయంలో రూ.19,499గా ధర నిర్ణయించారు. హిమాలయన్ బ్లూ, సుందర్‌బాన్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉందీ ఫోన్. వివో వై58 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2408 పిక్సెల్స్ 2.5 డీ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4 ఎన్ఎం క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది. వివో వై58 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. నాలుగేండ్ల పాటు బ్యాటరీ లైఫ్ హామీ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
0 Comments