Ad Code

రూ. 1000 ఫోన్‌ ధర సెగ్మెంట్లో జియో భారత్‌ వాటా 50 శాతం !


తేడాది విడుదలైన జియో భారత్‌ కీ ప్యాడ్‌ ఫోన్‌  సంచలనాలను నమోదు చేస్తోంది. జియో 4జీ నెట్‌ వర్క్‌ పై ఆధారపడి పని చేసే ఈ ఫోన్‌ ధర రూ. 999. ఇది ఇప్పుడు భారతీయ మార్కెట్‌ని శాసించే స్థాయికి చేరుకుంది. రూ. 1000 ఫోన్‌ ధర సెగ్మెంట్లో జియో భారత్‌ ఒక్కటే 50శాతానికి పైగా వాటాను కలిగి ఉందని 2024 వార్షిక నివేదికలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. సాధారణంగా స్మార్ట్‌ ఫోన్ లో అనేక ఫీచర్లు మనకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సాధనాలు దానిలో ఉంటాయి. అయితే రిలయన్స్‌ ఫీచర్‌ ఫోన్ లోనే ఈ స్మార్ట్‌ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. జియో భారత్‌ కీ ప్యాడ్‌ ఫోన్ లోనే వాట్సాప్‌, యూ ట్యూబ్‌ వంటి వాటితో పాటు జియో భారత్‌ యూపీఐ, జియో , జియో టీవీ వంటి వాటికి యాక్సెస్‌ నుంచి ఇచ్చింది. పైగా ఈ ఫోన్‌ వాడేవారికి రీచార్జి ప్లాన్లు కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది. ఇటీవల అన్ని టెలికాం క్యారియర్లతో పాటు జియో కూడా తమ ప్లాన్ల ట్యారిఫ్‌ను పెంచినా  జియో భారత్‌ ప్లాన్లను మాత్రం పెంచలేదు. ప్రస్తుతం జియో భారత్‌ యూజర్లు నెలకు కేవలం రూ. 123తో పూర్తి డిజిటల్‌ సేవలను ఆస్వాదిస్తున్నారు. ఇతర ఆపరేటర్లు ఇదే ప్యాకేజీని రూ. 199 నుంచి ప్రారంభిస్తుండటం గమనార్హం. వార్షిక నివేదిక విడుదల చేసిన సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ షేర్‌ హోల్డర్లకు ఓ లేఖ రాశారు. దానిలో మన దేశంలో 2జీ నుంచి 4జీకి ఆ తర్వాత 5జీకి అప్‌ డేట్‌ కావడానికి జియో భారత్‌ చాలాకీలకంగా పని చేసిందన్నారు. 2016లో జియో 4జీని తీసుకొచ్చి దేశంలోకి డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ చేశామన్నారు. జియో డేటా డార్క్‌ ఇండియాను డేటా రిచ్‌ నేషన్‌గా మార్చిందని చెప్పారు. ప్రతి ఇంటికీ అతి తక్కువ ధరలో హై స్పీడ్‌ 4జీ డేటాను అందించినట్లు ఆ లేఖలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు జియో తన ట్రూ 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. అతి తక్కువ సమయంలోనే 5జీ సర్వీసెస్‌ను భారతదేశం అంతటా విస్తరించినట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu