Ad Code

మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అభ్యంతరం !


బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్‌కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు. ఆమె ప్రకటనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహ్మమూద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వీక్షించిన అనంతరం బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హసన్ మహ్మమూద్ స్పందించారు. మమతా బెనర్జీ అంటే తమకు గౌరవముందన్నారు. పరస్పర అవగాహనతో.. ఆసక్తితో.. తాము సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే మమతా బెనర్జీ చేసిన ఈ ప్రకటన.. గందరగోళం సృష్టించే విధంగా ఉండడమే కాకుండా.. ప్రజలను సైతం గందరగోళంలో పడేసే విధంగా ఉందని చెప్పారు. ఆ క్రమంలో ఆమె ప్రకటనపై భారత ప్రభుత్వానికి నోట్ పంపినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి వివరించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవ్య సైతం ఎక్స్ వేదికగా మరోసారి స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌కే కాదు, ప్రస్తుతం భారతదేశానికే సైతం ఇబ్బందికరంగా మారారని వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments

Close Menu