వాట్సాప్ అకౌంట్ ను క్రియేట్ చేయాలంటే కచ్చితంగా ఫోన్ నంబర్ కావాలి. అయితే తాజాగా అందుబాటులోకి రానున్న ఫీచర్ ద్వారా యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా వాట్సాప్ ప్రస్తుతం కొత్త ఫీచర్ పైన పనిచేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ నేమ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇతరులకు మెసేజ్ చేసే సమయంలో ఫోన్ నంబర్ కు బదులుగా యూజర్ నేమ్ ద్వారా చాట్ చేయవచ్చు. కొత్త వ్యక్తులతో చాట్ చేసే సమయంలో మీ ఫోన్ నంబర్ ను షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సా్ప్ వెబ్ యూజర్ల కు మాత్రమే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ ఆధారంగా ప్రస్తుతం ఈ యూజర్ నేమ్ ఫీచర్ ను అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతం ఇతర సోషల్ మీడియాలకు ఉపయోగిస్తున్న విధంగా యూజర్ నేమ్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ ఇతరులు క్రియేట్ చేసేందుకు వీలుండదని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ వినియోగదారులకు మరింత భద్రత కలుగుతుంది. కొత్త వారికి వాట్సాప్‌లో మెసేజ్ చేసిన సమయంలో మన ఫోన్ నంబర్‌కు బదులుగా కేవలం యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే మీరు పరస్పరం ఫోన్ నంబర్లు షేర్ చేసుకున్నట్లయితే వాట్సాప్ అకౌంట్‌లో మీ ఫోన్ నంబర్ ను గుర్తించవచ్చు. ఈ ఫీచర్ కోసం గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే ఎప్పటి నుంచి కచ్చితంగా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. దీంతోపాటు మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న భద్రతతోపాటు ఈ ఫీచర్ కారణంగా మరింత భద్రతను పొందవచ్చని తెలుస్తోంది.
0 Comments