రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (వీఐ) తదితర కంపెనీలు అమెజాన్ ప్రైమ్ వీడియోకు యాక్సెస్‌ను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. రెగ్యులర్ గా చేసుకునే రీచార్జులతో మొబైల్ సేవలు పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో నచ్చిన కార్యక్రమాలను వీక్షించవచ్చు. రిలయన్స్ జియో తన ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియోతో కూడిన ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. స్టాండర్డ్ డెఫినిషన్‌లో సింగిల్ డివైస్, మొబైల్ స్ట్రీమింగ్ కోసం మాత్రమే దీన్ని రూపొందించారు. జియో రూ.1,029 ప్లాన్, రిలయన్స్ జియో రూ.1,029 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ లో మొత్తం 168 జీబీ డేటా అందజేస్తారు. అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవచ్చు. దీనికి అదనంగా 56 రోజుల ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను పొందవచ్చు. ఇది స్టాండర్డ్ డెఫినిషన్ స్ట్రీమింగ్‌ను అందించే సింగిల్ డివైస్, మొబైల్ ప్లాన్. ఈ ప్లాన్ లో అపరిమిత 5 జీ డేటా కూడా లభిస్తుంది. తక్కువ ఖర్చుతో మీ మొబైల్ పరికరంలో ప్రైమ్ వీడియోను వీక్షించవచ్చు. భారతీ ఎయిర్‌టెల్ కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రెండు విభిన్న ప్లాన్లను అందిస్తోంది. ప్రైమ్ వీడియో, ఉచిత వన్ డే డెలివరీతో సహా అన్ని ప్రైమ్ ప్రయోజనాలను వీటిలో లభిస్తాయి. ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే ద్వారా విస్తృత డేటా, అదనపు ఓటీటీ యాప్ యాక్సెస్‌ను కూడా అందిస్తాయి. ఎయిర్‌టెల్ రూ. 838 ప్లాన్ 56 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. రోజుకు 3 జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవచ్చు. వీటితో పాటు 84 రోజుల పూర్తి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. సోనీ ఎల్ఐవీ, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్, ఈరోస్ నౌ, హోయ్ చోయ్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే లో మనోరమమాక్స్‌తో సహా ఇరవై కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఎయిర్ టెల్ రూ.1,199 ప్లాన్ లో రోజుకు 2.5 జీబీ చొప్పున డేటా లభిస్తుంది. 84 రోజుల పాటు మొత్తం 210 జీబీ డేటా అందజేస్తారు. అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవచ్చు. 84 రోజుల పూర్తి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అపరిమిత 5జీ యాక్సెస్‌ను లభిస్తుంది. సోనీ ఎల్ఐవీ, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్ కోడ్, ఈరోస్ నౌ, హోయ్ చోయ్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్లే లో మనోరమమాక్స్‌తో సహా ఇరవై కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. వొడాఫోన్ ఐడియా (వీఐ) ప్రైమ్ లైట్‌తో కూడిన ప్లాన్లను అందిస్తోంది. ఇది హెచ్ డీ (720p)లో రెండు పరికరాల్లో (టీవీ లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను అనుమతిస్తుంది. అలాగే ఉచిత వన్ డే డెలివరీని కలిగి ఉంది. వోడాఫోన్ ఐడియా రూ.996 ప్లాన్ 84 రోజుల పాటు చెల్లబాటులో ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎమ్ఎస్ లు లభిస్తాయి. అలాగే 90 రోజుల ప్రైమ్ లైట్‌ను అందుకుంటారు. హెచ్ డీ కంటెంట్‌ను ఇష్టపడే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. వీటితో పాటు ఉదయం 12 నుంచి ఉదయం 6 గంటల వరకూ అపరిమిత డేటా లభిస్తుంది. రాత్రి డేటా, వారాంతాల్లో ఉపయోగించని వారాంతపు డేటాను రోల్ చేసే ఎంపిక, అదనపు ఖర్చు లేకుండా నెలవారీ 2జీబీ బ్యాకప్ డేటా అలవెన్స్ ఉన్నాయి.
0 Comments