కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు చిరాగ్ పటేల్ అనే వ్యక్తిపై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. కేంద్రమంత్రిపై ఉద్దేశపూర్వకంగా డీప్‌ఫేక్ వీడియో చేసినట్లుగా హర్ష్ సంఘవి పేర్కొన్నారు. పౌరులను తప్పుదారి పట్టించేందుకు డీప్‌ఫేక్‌లను వ్యాప్తి చేసే ఈ మోసపూరిత చర్య అసహ్యకరమైనదని సంఘవి అన్నారు. జీఎస్టీకి సంబంధించిన పన్నుల విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లుగా ఉన్న నకిలీ వీడియోలను చిరాగ్ పటేల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నకిలీ వీడియో అంటూ రాష్ట్ర మంత్రి కొట్టిపారేశారు.
0 Comments