కవిత ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవితను మెడికల్ చెకప్ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కవిత ఆరోగ్యంపై రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. కాగా ఇటీవల జైలులో ఆమె అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కవిత బెయిల్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 22 వరకు పొడిగించింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కవితను దీన్ దయాల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2024 మార్చి 15 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
0 Comments