Ad Code

వ్యాపార భాగస్వాములకు పేటీఎం హెల్త్ సాథీ !


పేటీఎం ఆరోగ్య భీమా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ ఆరోగ్య భీమా తమ వ్యాపార భాగస్వాముల కోసం ప్రవేశ పెట్టింది. పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ లో పేటీఎం హెల్త్ సాథీ ఆరోగ్య భీమా సౌకర్యాన్ని ప్రారంభించింది. వ్యాపార భాగస్వాములకు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ ఉండేలా పేటీఎం  హెల్త్ సాథీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ భీమా వల్ల పేటీఎం వ్యాపారులకు సురక్షిత ఆరోగ్య భీమా వారికి అందుబాటులో ఉండే కవరేజిని ఇస్తుంది. అంతేకాదు వారి భాగస్వాములను బలపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కేవలం నెలవారీ తక్కువ ఛార్జితో ఈ భీమా పేటీఎం  వ్యాపారులకు ఇస్తుంది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ కేవలం 35 రూపాయాలు మాత్రమే ఈ భీమా వారికి అందిస్తుంది. హెల్త్ సాథీ గురించి పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ ఈ భీమా తమ వ్యాపార భాగస్వాముల శ్రేయస్సు కోసం మా అంకిత భావం తెలియచేస్తుందని అన్నారు. ప్రస్తుతం నెల వారి సబ్ స్క్రిప్షన్ 35 రూపాయలతో ప్రారంభించింది. పేటీఎం హెల్త్ సాథీతో అపరిమిత డాక్టర్ టెలి కన్సల్ టేషన్, ఇన్ పర్సన్ డాక్టర్ విజిట్ సేవలను కూడా అందిస్తుంది. న్యాచురల్ రిస్క్ టైమ్ లో ఆసరాగా కూడా ఉండేలా ఈ భీమా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు ఏవైనా వరదలు, అగ్ని ప్రమాదం ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యాపారం నష్ట పొతే వారికి ఆదాయ రక్షణ కవరేజి కూడా భీమాదారులకు అందించే ఏర్పాట్లు చేసింది. ఇవే కాకుండా ఫార్మసీలో డిస్కౌంట్లు, డయాగ్నస్టిక్ టెస్ట్ లతో మరికొన్ని అదనపు ప్రయోజనాలు అందిస్తుంది. క్లయిమ్ ప్రక్రియ కూడా కేవలం యాప్ లోనే చేసేలా సౌకర్యం. ఇప్పటికే 3000 మంది వ్యాపార భాగస్వాములు ఈ భీమా ప్లాన్ తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu