వాట్సాప్ లో కూడా Meta AI ని తీసుకు వచ్చిన వాట్సాప్, ఈ కొత్త ఫీచర్ ను మరింత సౌకర్యవంతంగా మార్చేలా కొత్త అప్డేట్ లను జత చేయడానికి చూస్తోంది. వాట్సాప్ యూజర్లు వారి AI క్రియేట్ అవతార్ కోసం సింపుల్ గా సింగిల్ క్లిక్ ఫీచర్ ను ఇప్పుడు కొత్తగా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో ఇటీవల చేర్చిన మెటా AI తో మీకు నచ్చిన AI ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా కూడా ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు వాట్సాప్ యూజర్ల కోసం ఇదే మెటా AI తో మరింత ఉపయోగకరమైన కొత్త ఫీచర్ ను తీసుకు రావడానికి వాట్సాప్ పని చేస్తోంది. ఈ ఫీచర్ తో యూజర్లు వారి అవతార్ లను AI సహాయంతో చిటికెలో క్రియేట్ చేసుకోవచ్చు. Meta AI ఫీచర్ ను అన్ని మెటా ప్లాట్ ఫామ్స్ లో ప్రవేశపెట్టింది. ఇందులో వాట్సాప్ కూడా ఉంది మరియు ఇప్పుడు వాట్సాప్ లో మెటా AI Lalama కూడా అందించింది. ఈ కొత్త సెక్షన్ నుండి యూజర్లు చాలా సింపుల్ ప్రాంప్ట్ లతో ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. వాస్తవానికి, ముందుగా అందించిన AI కంటే ఇది చాలా అడ్వాన్డ్స్ మరియు సింపుల్ ప్రాంప్ట్ లతో గొప్ప ఇమేజ్ లను క్రియేట్ చేసి అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ తో మెటా AI సెక్షన్ లో కేవలం 'Imagine me' అని టైప్ చేసి ప్రాంప్ట్ అందిస్తే, వెంటనే అవతార్ క్రియేట్ అవుతుంది. అంతేకాదు, ఇందులో imagine my girlfriend లేదా Wife వంటి మరిన్ని ఇతర ప్రాంప్ట్ లకు కూడా వెంటనే అవతార్ లను అందుకోవచ్చు. చాలా ఫన్నీగా మరియు క్రియేటివ్ ఇమేజ్ లను వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ద్వారా అందుకోవచ్చు.
0 Comments