Ad Code

లిక్కర్ స్కాంకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ నేపథ్యంలో లిక్కర్ అక్రమాలపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రంలో చెప్పినదానికంటే ఎక్కువ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు 18 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. లిక్కర్ స్కాంకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. తప్పులు చేసినవారిని వదిలేస్తే మనకు మాట్లాడే నైతిక హక్కు ఉండదని, 20వేలు లంచం తీసుకుంటున్న సామాన్య ఉద్యోగిని శిక్షించగలుగుతున్న మనం, ఇంత భారీ స్కాంకు పాల్పడ్డవారిని వదిలిపెట్టొద్దని డిప్యూటీ సీఎం సూచించారు. పెద్దోళ్ళు తప్పు చేస్తే శిక్షలుండవా అని సామాన్యుడు ఫీల్ అవ్వకూడదని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu