వాట్సాప్ గో-టు-మెసెంజర్ అప్లికేషన్ కొత్త అప్‌డేట్‌తో వస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌లో వాట్సాప్ ఛానెల్ ఓనర్లు తమ వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్‌లు, మీడియాను ఫార్వార్డ్ చేయడానికి ఫీచర్‌ను తీసుకువస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ద్వారా ఛానెల్ యజమానులు వారి వ్యక్తిగత చాట్‌ల నుంచి నేరుగా వారి ఛానెల్‌లకు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, జిఫ్ త్వరగా సులభంగా షేర్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. త్వరలో రెగ్యులర్ యూజర్లందరికి కూడా అందుబాటులోకి రానుంది. నివేదిక ప్రకారం బీటా ప్రోగ్రామ్‌లోని కొంతమంది వినియోగదారులు ఇప్పుడు కొత్త ఛానెల్ ఫార్వార్డింగ్ ఫీచర్‌ను పొందవచ్చు. వాట్సాప్ ఇప్పుడు ఈ మార్పును పబ్లిక్‌తో టెస్టింగ్ చేస్తున్నట్టుగాకనిపిస్తోంది. ఈ ఫీచర్‌లో ఛానెల్ అడ్మిన్లు థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా ఫైల్ ఎక్స్‌ప్లోరర్ వంటి ఇతర యాప్‌ల నుంచి నేరుగా వారి ఛానెల్‌లకు వారి మీడియాను కూడా షేరింగ్ చేయవచ్చు. వాట్సాప్ మెసేజ్, ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫార్మాట్లను నేరుగా ఛానెల్‌లకు సులభంగా ఫార్వార్డ్ చేయొచ్చు. అలాగే షేరింగ్ కూడా చేయొచ్చు. కాంటాక్టు ఛానెల్ అడ్మిన్లకు గణనీయమైన మరింత పవర్ అందిస్తుంది. ఈ ఫీచర్ గతంలో అవసరమైన మల్టీ ఆప్షన్లను తొలగించడం ద్వారా ఛానెల్‌లను సులభంగా మేనేజ్ చేయొచ్చు. వినియోగదారులు ఇకపై ముందుగా మీడియాను వారి ఫోన్లలో సేవ్ చేసి ఆపై మాన్యువల్‌గా ఛానెల్‌కు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా వారి వ్యక్తిగత చాట్‌ల నుంచి కంటెంట్‌ను ఫార్వార్డ్ చేయవచ్చు లేదా ఫైల్ ఎక్స్‌ప్లోరర్లు లేదా ఫొటో లైబ్రరీ వంటి ఇతర యాప్‌ల నుంచి మీడియాను నేరుగా వారి ఛానెల్‌లకు షేర్ చేయవచ్చు. ఛానెల్ యజమానులు సాంప్రదాయకంగా కంటెంట్‌ని రెడీ చేయడానికి అప్‌లోడ్ చేసేందుకు వెచ్చించే సమయాన్ని తగ్గిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు ఛానెల్‌లలో ఫార్వార్డ్, షేర్ మెసేజ్, మీడియా అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.
0 Comments