ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశంలో రైల్వేల మౌలిక సదుపాయాలపై నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రత్యేక డ్రైవ్ కింద దేశంలో మరో 2500 జనరల్ కోచ్‌ల తయారీ చేపట్టినట్లు వెల్లడించారు. వీటికి అదనంగా మరో 10 వేల జనరల్ కోచ్‌లకు ఆమోదం లభించిందని రైల్వే శాఖ మంత్రి తెలిపారు. మరోవైపు ఈ ఏడాది వేసవిలో ప్రయాణికుల భారీ రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 10 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపిందని పేర్కొన్నారు. రైల్వేల సేవలు, భద్రత, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యం కసరత్తు చేస్తోందని వివరించారు.
0 Comments