మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలోని ఖుజరహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మూడు రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే నొప్పి ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించాడు. ఛతుర్పుర్ జిల్లా ఆసపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎక్స్‌రే నిర్వహించిన డాక్టర్ నంద్ కిషోర్ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. యువకుడు కడుపులో ఒక సొరకాయ ఉన్నట్లు గుర్తించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. దీంతో వెంటనే శస్త్ర చికిత్స చేసి సొరకాయను బయటకు తీశారు. సొరకాయ కారణంగా యువకుడు పెద్ద పేగు నలిగిపోయింది. ఈ కారణంగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి కొంద ఆందోళన కరంగానే ఉందని చికిత్స కొససాగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇక యువకుడి శరీరంలో ఈ సొరకాయ మల మార్గం నుంచి వచ్చిన వైద్యులు భావిస్తున్నారు. అయితే సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా.? అసలు కారణం ఏంటన్న విషయం తెలియాలంటే సదరు వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే సదరు వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.
0 Comments