Ad Code

ఫైల్స్ వైసీపీ పార్టీ కార్యాలయంలో తగులబెట్టామా ?


ఆంధ్రప్రదేశ్ లోని  యనమలకుదురులో పీసీబీ, మైనింగ్ శాఖ కార్యాలయానికి చెందిన ఫైల్స్‌, రిపోర్టులను సిబ్బంది కృష్ణానది కరకట్టపై దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో ఇప్పటికే డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. పీసీబీ ఓఎస్డీ రామారావు ఆదేశాలతోనే ఫైల్స్, రిపోర్డులను దగ్ధం చేసినట్లు డ్రైవర్ చెప్పడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మాయం చేసేందుకే ఫైల్స్ ను దగ్ధం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. కూటమి ప్రభుత్వంలో పీసీబీ ఫైల్స్ దగ్ధం జరిగితే ఆ తప్పులతో తమకేమీ సంబంధమని ప్రశ్నించారు. ఆ ఫైల్స్ వైసీపీ పార్టీ కార్యాలయంలో తగులబెట్టామా అని ఆయన ప్రశ్నించారు. ఫైల్స్ దగ్ధంపై అవసరమైతే సీబీఐ, సీఐడీతో విచారణ జరిపించుకోవాలని పేర్ని నాని సూచించారు. పత్రాలు తగులబెడుతుంటే అధికారంలో ఉన్న వాళ్లు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని ఫీలవుతున్నారా అని ఆయన ఎద్దేవ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu