ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యావరణం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ చెట్టు గురించి మాట్లాడుతూ అది చాలా డేంజర్ వెంటనే తొలగించండి అని అధికారులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ చెట్టు గురించి ప్రస్తావించారు. ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫాంహౌస్‌లో పెంచానని పవన్ తెలిపారు. అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తొలగించాను అన్నారు. కాకినాడలో మొత్తం 4,602 కానో కాన్ఫరస్ చెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఏడాకుల చెట్టు (కోనో కార్పస్) ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు. దక్షిణ అమెరికాకు చెందిన కోనో కార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం పెంచుతున్నారు. వాటి వలన భూగర్భజలాలు తగ్గపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ లో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది.
0 Comments