ఇండిగో విమానంలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్టింది. దీంతో సోషల్ మీడియా యూజర్లు ఆ మహిళపై ఫైర్ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రాంలో సల్మా షేక్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్యాసింజర్లు విమానంలోకి ఎక్కి కూర్చోగా, ఫ్లైట్ సిబ్బంది ఓవర్‌హెడ్ బిన్ క్లోజ్ చేస్తున్నారు. ఈ సమయంలో సల్మా షేక్ డ్యాన్స్ స్టార్ట్ చేసింది. ఫ్లైట్ టేకాఫ్‌కి రెడీ అవుతుండగా ఆమె ఇలా డ్యాన్స్ చేయడంతో తోటి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మరికొందరు, చూసి చూడనట్లు వ్యవహరించారు. ముందుకు, వెనక్కి కదులుతూ వీడియో చేయడంతో ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు. అయినా పట్టించుకోకుండా సల్మా షేక్ డ్యాన్స్ కంటిన్యూ చేయడంతో ఆమెకు పిచ్చి పట్టిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రాంలో 16 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 16 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అయితే, కామెంట్లతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. ఇన్‌స్టా యూజర్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. 'ఇష్టమొచ్చినట్లు ఇలా నాన్సెన్స్ చేయడానికి ఇదేమీ ఆమె ప్రైవేట్ ఫ్లైట్ కాదు. ప్యాసింజర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు' అని ఓ యూజర్ విమర్శించాడు. 'పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి చేష్టలు చేయడానికి కనీసం సిగ్గుగా అనిపించదా? ఈ వీడియో వికారంగా అనిపిస్తోంది. ఇలాంటి వీడియో చేసిన ఈమెను చూసి నవ్వాలో, ఏడవాలో నాకర్థం కావట్లేదు' అని మరో యూజర్ కామెంట్ చేశారు. 'హలో.. ఇదేమీ నీ ఇల్లు కాదు ఇష్టమొచ్చినట్లు వయ్యారాలు ఒలికించడానికి' అని మరొకరు మండిపడ్డారు.
0 Comments