Ad Code

మధుమేహం - ఖర్జూరం !


ధుమేహంతో వున్న వారు ఖర్జూరం తీసుకోవాలా.? లేదా?  అన్న ఆలోచనలో ఉంటారు. నిజానికి ఖర్జూరంలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, కాపర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్య పోషకాలకు పెట్టింది పేరు. సాధారణంగా ఖర్జూరం రుచి తియ్యగా ఉన్న కారణంగా చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌ తీసుకోకూడదనే ఆలోచనతో ఉంటారు. అయితే ఖర్జూరాలను షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి భయం లేకుండా తీసుకొవచ్చు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుంచి 55 శాతం వరకూ ఉంటుంది. కాబట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగవు. వీటిలోని ఫైబర్‌ కంటెంట్‌ కూడా షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌ డార్క్‌ చాక్లెట్‌ తినాలనే కోరిక ఉన్నా భయపడి తీసుకోరు. అయితే డార్క్‌ చాక్లెట్ వల్ల షుగర్‌ స్థాయిలు పెరగవని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు. కార్డియో సంబందిత రోగాల బారి నుంచి కూడా దూరంగా ఉంచుతాయి. కొన్ని రకాల పండ్ల విషయంలో కూడా షుగర్‌ పేషెంట్స్‌ భయపడుతుంటారు. ముఖ్యంగా తియ్యగా ఉండే యాపిల్‌ తీసుకోవడానికి జంకుతుంటారు. అయితే షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి భయం లేకుండా యాపిల్స్‌ను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. తియ్యగా ఉండే జామకాయ తీసుకోవాలన్నా చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే జామలో విటమిన్ ఎ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగర్‌ వ్యాధిగస్తులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ సి అధికంగా ఉండే పండ్లు కూడా షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి భయం లేకుండా ఆరంజ్‌, నిమ్మకాయ, ఉసిరి వంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu