Ad Code

సోనీ బ్రావియా 3 టీవీ సిరీస్ విడుదల !


దేశీయ మార్కెట్లో సోనీ ఇండియా బ్రావియా టీవీ కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సిరీస్ అద్భుతమైన ఫొటో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ పరంగా యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. బ్రావియా 3 సిరీస్ 43 అంగుళాల నుంచి 85 అంగుళాల వరకు వివిధ సైజుల్లో వస్తుంది. ప్రతి మోడల్ 4K HDR ప్రాసెసర్ X1ని కలిగి ఉంది. 4K యేతర కంటెంట్‌ను 4కె రిజల్యూషన్‌కు పెంచుకోవచ్చు. తద్వారా ఫొటో క్వాలిటీని మెరుగుపర్చుకోవచ్చు. TRILUMINOS ప్రో టెక్నాలజీ కలర్ కచ్చితత్వాన్ని అందిస్తుంది. విజువల్స్‌ను మరింత క్లారిటీగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు.. మోషన్‌ఫ్లో XR సెకనుకు ప్రదర్శించే వ్యూ సంఖ్యను పెంచుతుంది. స్ర్కీన్ ఫొటో బ్లర్‌ను తగ్గిస్తుంది. సోనీ సెంటర్‌లు, ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్‌లు, ఇ-కామర్స్ పోర్టల్‌లలో అందుబాటులో ఉన్నాయి. సోనీ ఇప్పటికే అనేక మోడళ్లను ప్రకటించింది. అయితే, ప్రస్తుతానికి కంపెనీ రెండు మోడళ్ల ధరలను మాత్రమే వెల్లడించింది. కె-55ఎస్30 ధర రూ. 93,990గా ఉంది. అయితే కె-65ఎస్30 ధర రూ. 1,21,990కు అందిస్తోంది. రెండు మోడల్‌లు ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఇతర మోడళ్ల ధరలు త్వరలో ప్రకటించనుంది. ఈ సిరీస్‌లోని టీవీలు డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తాయి. డాల్బీ విజన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. అయితే, డాల్బీ అట్మాస్ మల్టీడైమెన్షనల్ సౌండ్‌ను అందిస్తుంది. వస్తువులు పైకి కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఎక్స్-బ్యాలెన్స్‌డ్ స్పీకర్ డిజైన్ టీవీ సొగసైన డిజైన్‌తో ఆడియో క్లారిటీని అందిస్తుంది. బ్రావియా 3 సిరీస్ గూగుల్ టీవీతో వస్తుంది. 4లక్షల కన్నా ఎక్కువ సినిమాలు, టీవీ ఎపిసోడ్‌లు, 10వేల యాప్‌లు, గేమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ పిల్లలకు సురక్షితమైన వ్యూ వాతావరణంలో గూగుల్ కిడ్స్ ప్రొఫైల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అదనంగా, గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ సెర్చ్ ఫీచర్ యూజర్‌లు టీవీని వాయిస్ కమాండ్‌లతో కంట్రోల్ చేయడానికి సౌలభ్యం, యాక్సెసిబిలిటీని అనుమతిస్తుంది. సోనీ పిక్చర్స్ కోర్‌తో వినియోగదారులు సోనీ పిక్చర్స్ లేటెస్ట్ రిలీజ్, క్లాసిక్ సినిమాల ఎంపికను ప్రసారం చేయవచ్చు. ప్యూర్ స్ట్రీమ్ టెక్నాలజీ హెచ్‌డీఆర్ మూవీ స్ట్రీమింగ్‌ను 80ఎంబీపీఎస్ వరకు అందిస్తుంది. 4కె యూహెచ్‌డీ బ్లూ-రేతో పోల్చదగిన ఫొటో క్వాలిటీని అందిస్తుంది. గేమర్‌ల కోసం బ్రావియా 3 సిరీస్‌లో ఆటో హెచ్‌డీఆర్ టోన్ మ్యాపింగ్, ఆటో గేమ్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లాగ్‌ని తగ్గించడం, హెచ్‌డీఆర్ సెట్టింగ్‌లను ఆప్టిమైజ్ చేయడం ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తాయి. గేమ్ మెనూ ఫీచర్ గేమింగ్ స్టేటస్, సెట్టింగ్‌లు, అసిస్ట్ ఫంక్షన్‌లను సులభంగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ఎకో రిమోట్ 80శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌ని ఉపయోగించి తయారైంది. టీవీ ఎకో డాష్‌బోర్డ్ పవర్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సాయపడుతుంది.

Post a Comment

0 Comments

Close Menu