Ad Code

పార్కింగ్‌ చేస్తుండగా 30 అడుగుల ఎత్తు నుంచి పడిన కారు !


హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో కారు డ్రైవ్‌ చేసిన మహిళ దానిని పార్కింగ్‌ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అదుపుతప్పిన కారు 30 అడుగుల ఎత్తు నుంచి దిగువన ఉన్న గుంతలో పడింది. కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం కారు నడుపుతున్న మహిళ పార్కింగ్‌ కోసం ప్రయత్నించింది. రివర్స్‌ చేస్తుండగా ఆ కారు అదుపు తప్పింది. దిగువన ఉన్న 30 మీటర్ల లోతైన గుంతలో పడింది. బోల్తా పడిన కారు ధ్వంసం కాగా అందులో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా, పెద్ద శబ్దం విన్న స్థానికులు ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి కిందకు కారు పడటాన్ని గమనించారు. పరుగున కారు వద్దకు చేరుకున్నారు. కాళ్లు, చేతులకు గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu