జులై 30 న దేశీయ మార్కెట్లో రియల్‌మి 13 ప్రో సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో రియల్‌మి 13 ప్రో 5G, ప్రో ప్లస్ 5G మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.రియల్‌మి 13 ప్రో 5G, ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌లు AI ఫొటోగ్రఫీ ఆర్కిటెక్చర్‌ను లాంచ్ కానుంది. దీంతోపాటు ఈ సిరీస్‌లో ఫొటోగ్రఫీకి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రో ప్లస్ మోడల్ అత్యంత నాణ్యమైన ఫొటోగ్రఫీని అందిస్తుందని తెలుస్తోంది. ప్రో ప్లస్ మోడల్ డ్యూయల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరాలా వివిధ లైటింగ్ కండిషన్‌లలో నాణ్యమైన ఫోటోలను అందిస్తాయి. రియల్‌మి 13 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 3 లేయర్ AI ఇమేజింగ్‌తో కూడిన HYPERIMAGE+ కెమెరా వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ డివైస్ మరియు క్లౌడ్ ఆధారిత AI ఇమేజింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ ప్రో+ 5G మోడల్ తొలిసారిగా OIS సపోర్టుతో 50MP సోనీ LYT-701 కెమెరా మరియు 3X జూమింగ్ సామర్థ్యంతో 50MP సోనీ 600 పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ రెండు కెమెరాలు TUV Rheinland హై రిజల్యూషన్ కెమెరా సర్టిఫికేషన్‌ను పొందింది. గ్లాస్ ప్యానల్ కలిగిన ఎడిషన్ మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. అదే వేగాన్ లెదర్ ఆప్షన్‌లో ఎమరాల్డ్ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
0 Comments