జులై 25న దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ క్రెస్ట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు విడుదల కానున్నాయి. హెచ్ఎండీ సంస్థ X ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేసిన టీజర్ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌లు వెనుక వైపు గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ విడుదలకు సంబంధించి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ల్యాండింగ్ పేజీని క్రియేట్ చేసింది. హెచ్ఎండీ క్రెస్ట్ సిరీస్ లో క్రెస్ట్, క్రెస్ట్ మ్యాక్స్ 5G మోడళ్లతో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లను హెచ్ఎండీ సంస్థ భారత్‌లోనే తయారు చేస్తుంది. వెనుకవైపు గ్లాస్ డిజైన్‌తో కూడిన గ్లోసీ ఫినిష్‌ను కలిగి ఉంటాయి. ఈ కెమెరాలు పొర్ట్రెయిట్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు సొంతంగా రిపేర్ చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యూరప్‌లో అందుబాటులో ఉన్న హెచ్ఎండీ పల్స్ స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా హెచ్ఎండీ క్రెస్ట్ హ్యాండ్‌సెట్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ పల్స్ స్మార్ట్ ఫోన్ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.65 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. యూరప్‌లో ఈ పల్స్ హ్యాండ్‌సెట్ ధర EUR 140 (భారత్ కరెన్సీలో సుమారుగా రూ.12,400) గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు ఆక్టా కోర్ 12nm Unisoc T606 చిప్ సెట్ పైన పనిచేస్తుంది. 13MP వెనుక కెమెరా సహా 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 10W ఛార్జింగ్ సపోర్టు తో 5000mAh బ్యాటరీ పైన పనిచేస్తుంది.
0 Comments