తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా తితిదే చర్యలు తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజు వారి కోటాను వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో ఏ మార్పు చేయకుండా 500, ఆఫ్లైన్లో 1000 టికెట్లు మాత్రమే జారీ చేయనున్నారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా ఇస్తారు. మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లలో అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు.
0 Comments