Ad Code

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌ లో 12 మంది మావోయిస్టుల హతం !


హారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఆరు గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో దాదాపు 12 నుంచి 15 మంది మావోయిస్టులు దాక్కొని ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో భారీ బందోబస్తుతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలోని పోలీసులు బుధవారం ఉదయం ఆపరేషన్‌ ప్రారంభించారు. వర్షం కురుస్తున్నప్పటికీ, మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఇక పోలీసు బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. పలువురు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. సంఘటనా స్థలంలో 7 ఏకే 47 తుపాకీలతో పాటు పలు హై టెక్నాలజీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగడ్‌ దళం ఇంఛార్జ్ లక్ష్మణ్‌ ఆత్రం అలియాస్‌ విశాల్‌ ఆత్రం ఉన్నట్లు తెలిపిన పోలీసులు, మిగతా మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu