దేశీయ మార్కెట్లోకి జియోనీ సెల్ఫీ ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ 'ఏ1'ను తీసుకువచ్చింది. ఇం దులో సెల్ఫీ ఫ్లాష్‌తో కూడిన 16 ఎంపీ ఫ్రంట్ కెమె రా, 13 ఎంపీ రియర్ కెమెరా, 4,010 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 గిగాహెర్‌ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 5.5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 7.0 నుగోట్ ఓఎస్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 4జీ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ నెల 31 నుంచి అమెజాన్‌లో ప్రి-బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. జియోనీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో మార్కెటింగ్ కోసం రూ.750 కోట్లను వెచ్చించాలని భావిస్తోంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మార్కెటింగ్ బడ్జెట్ (రూ.400 కోట్లు)తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కాగా, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి జియోనీ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. మార్చి తర్వాత భారత్‌లో విక్రయమయ్యే అన్ని జియోనీ ఫోన్లు మేడిన్ ఇండియావేనని తెలిపింది.
0 Comments