సోషల్ మీడియాల్లో యాక్టివ్‌గా ఉండేవాళ్లు తమ పర్సనల్ ప్రొఫైల్ ప్రైవసీని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు ప్రొఫైల్స్ లాక్ లేదా హైడ్ వంటివి చేసుకోవాలి. సోషల్ మీడియాల్లో పర్సనల్ ప్రొఫైల్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ వివరాలు అందరికీ కనిపించేలా కాకుండా కేవలం ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా లాక్ వేసుకోవచ్చు. లేదా కొంతకాలంపాటు పూర్తిగా కనిపించకుండా హైడ్ కూడా చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ లాక్ చేసుకునేందుకు ముందుగా 'ప్రొఫైల్'పై క్లిక్ చేయాలి. అక్కడ త్రీ డాట్స్‌పై క్లిక్ చేస్తే 'లాక్ ప్రొఫైల్' అని కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ద్వారా ఇతరులు మీ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయలేరు. ఫ్రెండ్స్‌కు మాత్రమే మీ ప్రొఫైల్ వివరాలు కనిపిస్తాయి. ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను ఎవరికీ కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటే 'సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ'లోకి వెళ్లి 'ప్రైవసీ చెకప్'లోకి వెళ్లాలి. అక్కడ 'హూ కెన్ సీ వాట్ యు షేర్'పై క్లిక్ చేయాలి. అక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అందులో 'పబ్లిక్' కాకుండా 'ఓన్లీ మీ' అని సెట్ చేసుకుంటే ప్రొఫైల్ పోస్టులు ఇతరులక కనిపించవు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫైల్‌ను ప్రైవేట్‌లో పెట్టుకోవాలంటే ముందుగా త్రీ లైన్స్‌పై క్లిక్ చేసి అక్కడ 'సెట్టింగ్స్'లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లో 'అకౌంట్ ప్రైవసీ' ఆప్షన్‌పై క్లిక్ చేసి అక్కడ 'ప్రైవేట్ అకౌంట్'పై క్లిక్ చేసి 'స్విచ్ టు ప్రైవేట్ అకౌంట్'పై నొక్కి కన్ఫర్మ్ చేయాలి. ప్రైవేట్ అకౌంట్‌గా మార్చుకోవడం ద్వారా మీరు అప్రూవ్ చేయకుండా ఎవరూ మిమ్మల్ని ఫాలో అవ్వలేరు. మీ ఫాలోవర్స్ కాని వాళ్లు మీ పోస్టులను చూడలేరు. ఇన్‌స్టా్గ్రామ్‌లో కొత్త వాళ్లు మిమ్మల్ని రీచ్ అవ్వకుండా ఉండాలంటే మీ అకౌంట్‌ను ప్రైవేట్‌కు మార్చుకుని యూజర్ నేమ్‌ను మార్చేస్తే సరి. ఇలా చేస్తే కొత్త వాళ్లు మీ అకౌంట్‌ను కనిపెట్టలేరు. మీరు యూజర్ నేమ్ చెప్పేవరకూ మీ అకౌంట్ గురించి ఎవరికీ తెలియదు.
0 Comments