Ad Code

హాస్పిటల్ లో వృద్ధ రోగి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సిబ్బంది?


హాస్పిటల్ బెడ్‌పై వృద్ధుడైన రోగి పడుకుని ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆ రోగి వద్దకు వచ్చాడు. ఉన్నట్టుండి మోచేతితో వృద్ధుడి కడుపులో కొట్టాడు. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. జూన్‌ 19న ఈ సంఘటన జరిగింది. హాస్పిటల్‌ యూనిఫారం ధరించిన ఒక వ్యక్తి రోగి పడుకున్న బెడ్‌ వద్దకు వచ్చాడు. కర్టెన్‌ను జరిపాడు. వృద్ధుడైన రోగికి చాలా దగ్గరగా వచ్చాడు. కర్టెన్‌ను మూసిన తర్వాత మోచేతితో రోగి కడుపుపై ​కొట్టాడు. కాగా, హాస్పిటల్‌ వార్డులో అమర్చిన సీసీటీవీలో ఇది రికార్డ్‌ అయ్యింది. ప్రొఫెసర్‌ సుధాంశు త్రివేది అనే యూజర్‌ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో అన్నది వెల్లడించలేదు.మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu