జుట్టు అనేది మగవారికైనా, ఆడవారికైనా చాలా ముఖ్యం. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటని చెప్పలేం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడం, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ఇలా అనేక కారణాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టుకు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని అప్లై చేస్తున్నారు. పెరుగు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుందన్న విషయం తెలిసిందే. ఒక గిన్నె తీసుకుని. జుట్టు పొడవును బట్టి పెరుగు, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒకటి వేయండి. పొడుగ్గా ఉంటే రెండు వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు బాగా పట్టించండి. ఓ అరగంట తర్వాతా షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు పెట్టినా మీ జుట్టు బలంగా, సాఫ్ట్‌గా తయారవుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.
గుడ్డు – విటమిన్ ఈ క్యాప్సూల్స్: ఒక గిన్నెలోకి గుడ్డు తెల్ల సొన, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఈ రెండూ కలపండి. దీన్ని జుట్టుకు బాగా పట్టించండి. ఓ పావు గంట సేపు తర్వాత షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టు సాఫ్ట్‌గా, బలంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది.
కొబ్బరి నూనె – విటమిన్ ఈ క్యాప్సూల్స్: ముందుగా ఒక గిన్నెలోకి కొబ్బరి నూనె తీసుకోండి. దీన్ని డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయండి. ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తలకు పట్టించి తలపై మర్దనా చేయండి. ఇలా చేయడం వల్ల తలపై రక్త ప్రసరణ జరుగుతుంది. అంతే కాకుండా జుట్టు మృదువుగా, బలంగా తయారవుతుంది.
0 Comments