బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. శనివారం ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర సిఎం నితీష్‌కుమార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. కాగా బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని జెడియు, ఆర్‌జెడి పార్టీలు కేంద్రాన్ని ఎన్నో ఏళ్ల నుండి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది నితీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రత్యేక హోదా తీర్మానాన్ని ఆమోదించింది. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో తాము ప్రత్యేక హోదా డిమాండ్లను పరిశీలించబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో మిత్ర పక్ష పార్టీగా జెడియు డిమాండ్‌ను మోడీ ప్రభుత్వం పరిశీలించి అమలు చేస్తే.. మరో మిత్ర పక్ష పార్టీగా టిడిపి కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
0 Comments