తాటి బెల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న చాలా మంది పంచదారకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతో మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా పెద్ద మొత్తంలో ఈ తాటి బెల్లం లభిస్తోంది. ఈ తాటి బెల్లం చూడడానికి కాస్త నలుపు రంగులో ఉంటుంది. వైద్య నిపుణులు సైతం తాటి బెల్లాన్ని ఉపయోగించమని చెబుతున్నారు. పంచదారతో పోలిస్తే తాటిబెల్లంలోని ఖనిజ లవణాలు 60 రెట్లు ఎక్కువగా ఉంటాయి. టీ, కాఫీ, పండ్ల రసాలలో కూడా ఈ బెల్లాన్ని ఉపయోగించవచ్చు. ఇది జీర్ణక్రియ ఎంజైమ్ లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేయడమే కాకుండా, శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను తాటి బెల్లంలో ఉండే ఇనుము, మెగ్నీషియం పెంచుతాయి. దీనివల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. ఫ్రీరాడికల్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల బలహీనత నుంచి బయటపడవచ్చు. నెలసరి సమస్యలతో పాటు అధిక బరువు సమస్యలను తాటిబెల్లం పరిష్కరిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాగా పొడిదగ్గు, జలుబుకు తాటిబెల్లం ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం పొడి, పావుచెంచా మిరియాల పొడి కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా జలుబు వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మాన్ని తొలగించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, శ్వాసకోశ, ప్రేగులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. తద్వారా ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది. గోరువెచ్చని నీటిలో తాటిబెల్లం కలుపుకొని తాగడంవల్ల జలుబు, దగ్గు తగ్గుతుంది. రక్తపోటును నియంత్రించడానికి ఇది ఎంతో బాగా ఉపకరిస్తుంది.
0 Comments