Ad Code

కుంకుడు కాయలు - ఆరోగ్య ప్రయోజనాలు !


కుంకుడు కాయల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్‌ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది. అయితే, దీన్ని నేరుగా వాడే బదులు, కాసిని మందార ఆకుల్ని కలిపి తలస్నానం చేయండి. ఇలా కనీసం నాలుగైదు వారాలు చేసి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. కుంకుడుకాయలకు యాంటీ అలర్జీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. అందుకే చర్మానికి క్లెన్సర్‌గానూ వాడొచ్చు. మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ దూరమవుతాయి. ఇందుకోసం కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు. క్రమంగా మీ సమస్య దూరమవుతుంది. కాలుష్యం, ఇతరత్రా సమస్యలు… ఈ రోజుల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ ఇబ్బందికి చెక్‌ పెట్టడానికి కుంకుడు రసం చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వాటిని రెండు మూడు గంటల ముందు నానబెట్టి రసం తీసి, దీనికి పావు కప్పు కలబంద గుజ్జు కలిపి తలకు రాయాలి. ఆపై ఐదు నిమిషాలాగి రుద్ది తలస్నానం చేస్తే మాడు నుంచి చివర్ల వరకూ పట్టిన మురికితో పాటు రసాయనాల తాలూకు ప్రభావం కూడా వదిలిపోతుందట. చాలామంది ముఖంపై చూపిన శ్రద్ధ పాదాలపై చూపించరు. దీనివల్ల అవి కాంతివిహీనంగా కనిపిస్తాయి. గోళ్లు, మడమలు మురికిగా మారతాయి. వీటిని శుభ్రం చేయడానికి కుంకుడు రసంలో కాస్త గులాబీనీరు చేర్చి ఓ పదినిమిషాలు నానబెట్టండి. ఆపై కొబ్బరి పీచుని తీసుకుని మృదువుగా రుద్దండి. టాన్, డెడ్‌స్కిన్‌ వదిలిపోయి పాదాలు కోమలంగా మారతాయి.

Post a Comment

0 Comments

Close Menu