Ad Code

యువతి ప్రమాదకర బైక్ స్టంట్ వీడియో ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ !

                                         

న్‌స్టాగ్రామ్ రీల్ కోసం తాజాగా పుణెలో ఓ యువతి చేసిన సాహసం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె గుండె ధైర్యానికి ఆశ్చర్యపోవాల్సిందే. @peepoye అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో పసుపు టీ షర్ట్ ధరించిన ఓ యువతి ప్రమాదకర బైక్ స్టంట్ చేసింది. వేగంగా వెళుతున్న బైక్‌పై ఒకవైపు కూర్చుని రకరకాల స్టిల్స్ ఇచ్చింది. ఆ సమయంలో ఆమె బైక్ హ్యాండిల్‌ పట్టుకోలేదు. బైక్ వేగంగా తన మానన తను వెళుతూ ఉంటే ఆమె సీటు మీద కూర్చుని రకరకాల ఫోజులు ఇస్తోంది. ఆమె చేష్టలను వేరే వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 7 వేల మంది చూశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేటి యువతకు చాలా నైపుణ్యాలు ఉన్నాయి. వాటిని వ్యక్తికరించే పద్ధతులు బాగోలేవు``, ``ఈ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయాలి``, ``పుణె ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఐ ఎలాంటి చర్యలు తీసుకోవాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Post a Comment

0 Comments

Close Menu