Ad Code

యూపీఐ లైట్‌` వాలెట్‌లోకి ఆటో రీఫ్లెష్‌మెంట్ ఫెసిలిటీ !


చిన్న మొత్తాల చెల్లింపులను మరింత ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రతిపాదన చేసింది. వివిధ మొబైల్ యాప్స్‌లో యూపీఐ లైట్ విధానాన్ని ఇంతకుముందే అమల్లోకి తెచ్చింది. యూపీఐ లైట్ ప్రతి కస్టమర్‌కు వాలెట్‌లా పని చేస్తుంది. ఈ యూపీఐ లైట్ వాలెట్‌లో నిర్దిష్ట లిమిట్ మనీ లేకపోతే, సంబంధిత యూజర్ బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వాలెట్‌లోకి తెచ్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం యూజర్లు తమ యూపీఐ లైట్ వాలెట్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలి. యూపీఐ లైట్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు ఈ-మ్యాండేట్ ఫ్రేమ్ వర్క్ పరిధిలోకి యూపీఐ లైట్ వాలెట్ తీసుకొస్తారు. దీనివల్ల సంబంధిత యూపీఐ లైట్ వాలెట్‌లో నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ మొత్తం ఉంటే ఆటోమేటిక్‌గా బ్యాంకు ఖాతా నుంచి మనీ యూపీఐ లైట్ వాలెట్‌లో క్రెడిట్ అవుతుందని తమ ద్రవ్య పరపతి సమీక్ష (ఎంపీసీ) నిర్ణయాలను వెల్లడిస్తున్నప్పుడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) 2022 సెప్టెంబర్‌లో యూపీఐ లైట్ సేవలను ప్రారంభించింది. ఈ యూపీఐ లైట్‌లో యూజర్లు రూ.2000 క్యాష్ లోడ్ చేసుకోవచ్చు. రూ.500 వరకూ ఎటువంటి పిన్ నంబర్ వాడకుండానే చెల్లింపులు జరపొచ్చు. ఇందుకోసం యూజర్లు తమ యూపీఐ లైట్ వాలెట్ బ్యాలెన్స్ కోసం థ్రెషోల్డ్ లిమిట్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ వాలెట్‌లో నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే.. సంబంధిత కస్టమర్ బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ లైట్‌లోకి మనీ క్రెడిట్ అవుతుంది. ఈ విధానాన్ని వినియోగంలోకి తీసుకొస్తే యూజర్ల యూపీఐ లైట్ వాలెట్‌లోకి మనీ క్రెడిట్ కావడానికి అడిషనల్ అథంటికేషన్, ప్రీ డెబిట్ నోటిఫికేషన్లు అవసరం లేదు. ఆటోమేటిక్ మనీ క్రెడిట్ కావడం వల్ల మాన్యువల్‌గా యూపీఐ లైట్ వాలెట్‌లను టాపప్ చేయాల్సిన అవసరం లేదు. తేలిగ్గా ఆఫ్ లైన్ లావాదేవీలు జరుపుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల ప్రజలకు యూపీఐ లైట్ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే రికరింగ్ పేమెంట్ ట్రాన్సాక్షన్లలో ఈ-మ్యాండేట్ విధానం పెరుగుతున్నది. ఈ విధానంతో ఇక ముందు ఫాస్టాగ్‌, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ)ల్లో పరిమితి కంటే తక్కువ మనీ ఉంటే.. వాటిల్లోకి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా మనీ రీప్లెష్ చేయడానికి ఈ-మ్యాండేట్ విధానం ఉపకరిస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయంలోనూ, మొబిలిటీ సంబంధ చెల్లింపులు తేలికవుతాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. 

Post a Comment

0 Comments

Close Menu