Ad Code

ఒరాకిల్ మై లెర్న్ ద్వారా రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు శిక్షణ ?


రాకిల్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒరాకిల్ మై లెర్న్ ద్వారా ఈ శిక్షణ ఇస్తారు. ఒరాకిల్, తమిళనాడు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణ ఇవ్వడానికి 'నాన్ ముదల్వన్' కార్యక్రమం కింద ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాయి. దేశంలో అత్యధిక యువ జనాభా గల టాప్-12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ నిపుణులు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించుకోవడానికి ఒక వేదికను అందించేందుకు 'నాన్ ముదల్వన్' అనే కార్యక్రమం చేపట్టామని తమిళనాడు రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఎండీ దివ్య చెప్పారు. ఒరాకిల్ సర్టిఫికెట్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ ఎండీ శైలేందర్ కుమార్ చెప్పారు. ఒరాకిల్ సర్టిఫికెట్ యువత జ్ఞానాన్ని పెంచడంతోపాటు కంపెనీలు కోరుకునే నైపుణ్యాలనూ ధృవీకరిస్తుందన్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలతోపాటు స్థిరత్వం పెరుగుతాయన్నారు.

Post a Comment

0 Comments

Close Menu