కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ''సింగరేణి కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉంటా. సింగరేణిని రక్షించాల్సిన బాధ్యత 49 శాతం వాటా ఉన్న కేంద్రంపై కూడా ఉంది. ఆ సంస్థకు లాభం చేకూర్చే పని కేసీఆర్, కేటీఆర్, భారాస ప్రభుత్వం ఏనాడూ చేయలేదు. ఉద్యోగులకు, కార్మికులకు సొంత ఇంటి పథకం అంటూ మభ్యపెట్టారు. వైద్య సదుపాయం, కాంట్రాక్ట్ కార్మికుల రైగ్యులరైజ్, కోల్ ఇండియా కార్మికుల తరహా జీతాలు వంటి హామీలన్నీ తుంగలో తొక్కారు. తెలంగాణ బిడ్డగా సింగరేణి ప్రయోజనాలే నాకు ముఖ్యం. వేర్వేరు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. రానున్న రోజుల్లో మనం కూడా ఆత్మనిర్భర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సొంత కాళ్లపై నిలబడాలి. దేశంలో బొగ్గు ఉత్పత్తి మరింత పెరగాల్సి ఉంది. ఆ దిశగా నరేంద్రమోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధికి అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. త్వరలోనే సింగరేణికి సంబంధించిన అన్ని అంశాలపై సమీక్ష నిర్వహిస్తా. కోల్ ఇండియా కూడా వేలంలో పాల్గొంటోంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చట్టం చేశాం. రాష్ట్రంలోని బొగ్గు గనులకు వేలం వేసుకోవాలని కేంద్రం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రూ.2వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. చట్టంతో మాకేం సంబంధం అని ఇవాళ భారాస నేతలు మాట్లాడుతున్నారు. చట్టం చేసిన సమయంలో వారు సభలోనే ఉన్నారు. దానికి మద్దతు ప్రకటించారు. సింగరేణి విషయంలో ప్రశ్నిస్తున్న నేతలు మైన్స్ వేలంలో ఎందుకు పాల్గొనలేదో సమాధానం చెప్పాలి. ఐరన్ వోర్, సున్నపురాయి గనులకు వేలం వేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఓడిపోయామనే బాధలో కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై జాలి చూపించాలి'' అని కిషన్‌రెడ్డి అన్నారు.
0 Comments