Ad Code

యూట్యూబ్‌లో డీప్‌ఫేక్‌ వీడియోల ఆటకట్టు ?


యూట్యూబ్‌ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను అరికట్టడంలో భాగంగా ముందడుగువేసింది. కొందరు కంటెంట్‌ క్రియేటర్లు తమ ఫాలోవర్లను ఆకట్టుకోవడంలో భాగంగా లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు. దీంతో ఏది నిజమైన వీడియోనో.. ఏది ఏఐ సాయంతో రూపొందించిన వీడియోనో తెలుసుకోలేక తికమకపడుతున్నారు. వ్యక్తులకు తెలియకుండా వారి వాయిస్‌ను ఉపయోగించి కంటెంట్‌ను అందిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టేందుకు యూట్యూబ్‌ సరికొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. కంటెంట్‌ క్రియేటర్లు తమ వీడియోలో ఏఐని వినియోగిస్తుంటే ఆ విషయాన్ని యూజర్లకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. తాజాగా మరికొన్ని ఫీచర్లు జోడించింది. వీటి సాయంతో వినియోగదారులు డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై రిపోర్ట్‌ చేయొచ్చు. ఇకపై యూట్యూబ్‌లో మీ ఫొటో లేదా వాయిస్‌ని ఉపయోగించి రూపొందించిన కంటెంట్‌ కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయొచ్చు. యూజర్ల అభ్యర్థన మేరకు ఆ వీడియోలను పరిశీలించి, కంటెంట్‌ వాస్తవానికి విరుద్దంగా ఉందా? అనే విషయాన్ని ధృవీకరించి సదరు వీడియోలను తొలగిస్తుంది. దీంతో యూజర్ల డీప్‌ఫేక్‌ వీడియోలను అరికట్టొచ్చని పేర్కొంది. యూజర్ల గోప్యతను పెంచడంలో భాగంగానే వీటిని తీసుకొచ్చినట్లు తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. 

Post a Comment

0 Comments

Close Menu