Ad Code

నేరేడు పండుతో తీసుకోకూడని పదార్ధాలు !


నేరేడు పండు మధుమేహం ఉన్న వారికి ఎంతో మేలు చేస్తుంది. నేరేడు పండ్ల ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. నేరేడు పండ్లను కొన్ని ఇతర పదార్థాలతో కలిపి తీసుకోకూడదు అంటున్నారు నిపుణులు. నేరేడుతో పాటు పుచ్చకాయ, దోసకాయ కూడా ఆరోగ్యానికి మంచిది. ఇవి పలు వ్యాధుల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఫాస్పరస్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం సరైన రీతిలో పనిచేయడానికి ఇవి సహాయపడతాయి. చాలా రుచిగా ఉండే ఈ పండు కోసం ఏడాది కాలం వేచి చూడాల్సిందే. అనేక ఔషధ గుణాలతో పాటు షుగరు, రక్తహీనత, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలను నియంత్రించడంతో సహాయపడతాయి. నేరేడు పండుతో పాటు పసుపును కలిపి తీసుకోకూడదు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ పండు తిన్న వెంటనే పసుపు తీసుకోకూడదు. ఈ రెండూ కలవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఈ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల అంతరం ఉండాలి. నేరేడు పండు, పాలు కలిపి తీసుకోకూడదు. నేరేడుతో పాలు తాగడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. వాటిని ఒకేసారి తింటే జీర్ణక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా గ్యాస్ కూడా పెరుగుతుంది. కొంతమంది పచ్చళ్లు, నేరేడు పండు కలిపి తింటూ ఉంటారు. ఇలా అస్సలు తినకండి. ఈ రెండింటి కలయిక విష ప్రభావానికి గురిచేస్తుంది. వీటిని కలిపి తింటే విరేచనాలు, అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వస్తాయి. ఈ రెండింటి మధ్య కనీసం 30 నిమిషాల అంతరం ఉండాలి. అలాగే నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీని పెంచడంతో పాటు విరేచనాలను కలగజేస్తుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం మాత్రమే తీసుకోవాలి. శరీర ఉదర కుహరం, ఆహార పైపు, మెడను దెబ్బతీయడంతో పాటు కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది.

Post a Comment

0 Comments

Close Menu