విగ్రహాల తరలింపుపై విపక్షాల ఆగ్రహం !


పార్లమెంటు భవనం సుందరీకరణ చర్యల్లో భాగంగా దాని ఆవరణలోని మహాత్మాగాంధీ, బి.ఆర్‌. అంబేద్కర్, ఛత్రపతి శివాజీ తదితరుల విగ్రహాలను తొలగించి, పాత భవనం సమీపంలోని లాన్‌లోకి మార్చారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ తప్పుబట్టింది. పాత పార్లమెంటు భవనం, గ్రంథాలయం నడుమ ఉన్న లాన్‌లోని గిరిజన నేత బిర్సా ముండా, మహారాణా ప్రతాప్‌ తదితరుల విగ్రహాలు యథాస్థానంలో ఉన్నాయి. గాంధీ, అంబేద్కర్, శివాజీల విగ్రహాల తరలింపును దారుణచర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ 'ఎక్స్‌' ద్వారా విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు భాజపాను ఆదరించనందుకే పార్లమెంటు ఆవరణలోని శివాజీ, అంబేద్కర్ విగ్రహాలను వాటి పూర్వస్థానం నుంచి తరలించారని కాంగ్రెస్‌ ప్రచార విభాగ అధిపతి పవన్‌ ఖేడా మండిపడ్డారు. గుజరాత్‌లోనూ భాజపా క్లీన్‌స్వీప్‌ ఆశలు వమ్ము కావడంతో మహాత్ముని విగ్రహం సైతం తొలగించారన్నారు. ''ఒక్కసారి ఆలోచించండి. వీళ్లకు 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని వదిలేవారా?'' అని 'ఎక్స్‌'లో ఖేడా ప్రశ్నించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, టీఎంసీ ఎంపీ జవాహర్‌ సర్కార్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలె కూడా విగ్రహాల తరలింపును ఖండించారు.పార్లమెంటు ఆవరణలోని విగ్రహాల తరలింపుపై విపక్షాల విమర్శల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ విగ్రహాలు వివిధ చోట్ల ఉండటం వల్ల సందర్శకులు వాటిని సరిగా చూడలేకపోతున్నారని పేర్కొంది. ఈ కారణంగానే వాటిని 'ప్రేరణా స్థల్‌'లోకి మార్చి, ఆయా నేతల జీవిత చరిత్రలను కూడా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains