యాక్సెంచర్ ఐర్లాండ్‌లోని డబ్లిన్ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న గ్లోబల్ ఐటి సేవల సంస్థ. కంపెనీ తాజాగా తన మూడో త్రైమాసిక కోసం సూచనను ప్రచురించింది. ఈ అంచనాలు రాబోయే త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల పరిశ్రమకు సంబంధించిన వ్యాపార అవకాశాలపై ముందస్తు పరిశీలనను అందిస్తాయి. ప్రస్తుతం యాక్సెంచర్ ఫలితాలు ఆశాజనకంగా ఉండటం ఐటీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఇండియన్ ఐటీ కంపెనీల వ్యాపారంలో 90-95 శాతం విదేశాల్లోనే జరుగుతున్నాయి. అందువల్ల వ్యాపార పోకడలకు సంబంధించిన అవగాహన పొందటానికి యాక్సెంచర్ రిపోర్ట్ పనికొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాక్సెంచర్ భారతదేశంలోని టాప్ పెర్ఫార్మింగ్ ఐటి దిగ్గజాల్లో ఒకటిగా ఉంది. యాక్సెంచర్ తన Q3 పనితీరు అంచనాలను విడుదల చేసింది. ఈ క్రమంలో సంస్థ మేనేజ్డ్ సర్వీసెస్ విభాగం బాగా పనిచేస్తుందని ప్రకటించింది. వాస్తవానికి భారతీయ ఐటీ కంపెనీలకు కూడా ఈ విభాగం ప్రధాన బలం. మూడవ త్రైమాసికంలో యాక్సెంచర్ మేనేజ్డ్ సేవల ఆదాయం 2 శాతం పెరిగి 8.01 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. ఇదే క్రమంలో పెద్ద డీల్స్ పొందేందుకు అగ్ర టెక్ కంపెనీల మధ్య కొనసాగుతున్న పోరు కారణంగా పోటీలో మధ్యతరగతి ఐటీ కంపెనీలు నష్టపోవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత కఠినమైన ఆర్థిక వాతావరణంలో ఖర్చులను తగ్గించే ఒప్పందాలు సాధారణంగా పెద్ద కంపెనీలకు వెళ్తాయి. యాక్సెంచర్ 2024 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయ అంచనాలను తగ్గించింది. ముందుగా 1- 3 శాతం వృద్ధిని అంచనా వేయగా దానిని ప్రస్తుతం 1.5-2.5 శాతానికి సవరించింది. గత సంవత్సరంతో పోల్చితే త్రైమాసికంలో యాక్సెంచర్ ఆదాయం 1 శాతం తగ్గి 16.5 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 55,000 మంది నైపుణ్యం కలిగిన డేటా & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉన్నారని సీఈవో జూలీ స్వీట్ వెల్లడించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డేటా & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్‌ఫోర్స్‌ను 40,000 నుంచి 80,000కి రెట్టింపు చేయాలనే లక్ష్యం దిశగా తమ కంపెనీ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
0 Comments