వోడాఫోన్ ఐడియా రీఛార్జీ ఛార్జీల ధరలను పెంచుతూ జియో, ఎయిర్‌టెల్ బాట పట్టింది. కొత్త ఛార్జీలు జులై 4 నుంచి నుంచి అమల్లోకి రానున్నాయి. వోడాఫోన్- ఐడియా 5G నెట్‌వర్క్ లో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపింది. 4G అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు, 5G సేవల ప్రారంభం సహా రానున్న రోజుల్లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు VI తెలిపింది. తాజా నిర్ణయంతో ప్రీపెయిడ్ రీఛార్జీ ప్లాన్ రూ.179 ధర రూ.199 గా మారింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా మొత్తంగా 2GB హైస్పీడ్ డేటా సహా 300 SMS లను పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. VI రూ.459 ప్లాన్.. రూ.509 గా మారింది. ఇందులో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా 300 SMSలను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 6GB హైస్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు ప్లాన్ వ్యాలిడిటీ 84గా ఉంది. అదేవిధంగా రూ.1799 ప్లాన్.. రూ.1999 గా మారింది. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అల్‌లిమిటెడ్ కాలింగ్, 300 SMS, 24GB డేటాను మాత్రమే పొందుతుంది. రూ.269 ప్లాన్.. రూ.299 గా మారింది. ఇందులో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిడెట్ కాలింగ్ సహా రోజుకు 1GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రూ.299 ప్లాన్.. రూ.349 గా మారింది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS, 1.5GB డేటాను కలిగి ఉంటుంది. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. మరియు వీకెండ్ రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీను కలిగి ఉంది. వోడాఫోన్ ఐడియా రూ.319 ప్లాన్.. రూ.379 ప్లాన్‌గా మారింది. నెలరోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చు. వీకెండ్ రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
0 Comments