జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. రాజౌరి, పూంచ్, రియాసి ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
0 Comments