ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసముంటున్న తాడేపల్లి వద్ద ప్రభుత్వం బందోబస్తును తొలగించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తనకు సెక్యురిటీగా ప్రైవేటు వారిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేటు సంస్థకు చెందిన 30 మంది భద్రత సిబ్బంది జగన్ ఇంటి వద్ద నిరంతరం పహరా కాస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భధ్రత సిబ్బంది నిరంతరం జగన్ కు స్పెషల్ గా సెక్యురిటీ ఇస్తారు. ఇదిలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు ఆ ప్రాంతంలో కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో . స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించింది. దీంతో ఆ రోడ్డు సీతానగరం నుంచి రేవేంద్రపాడు వెళ్లేందుకు దాదాపు 1.5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి బాధ తప్పింది.
0 Comments