దేశీయ మార్కెట్లోకి బజాజ్ ఆటో చేతక్ 2901 విడుదలైంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95,998 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త, మరింత సరసమైన ట్రిమ్ యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఐదు కొత్త కలర్ ఆప్షన్లలో రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ ఉన్నాయి. బజాజ్ చేతక్ 2901 పూర్తి మెటల్ బాడీని కూడా కలిగి ఉంది. బజాజ్ చేతక్ 2901 వేరియంట్ అర్బేన్ వేరియంట్ మాదిరిగా అదే కలర్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. డిజైన్ పరంగా చేతక్ 2901 ఇతర ట్రిమ్ స్థాయిల మాదిరిగానే ఉంటుంది. కానీ, ఈ స్కూటర్ కొన్ని ఫీచర్లను కలిగి లేదు. ఉదాహరణకు, ఒక రైడింగ్ మోడ్‌తో మాత్రమే వస్తుంది. స్టీల్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, టెక్ ప్యాక్ (TecPac) ఉంది. దీని విలువ రూ. 3వేలుగా ఉంది. మరిన్ని ఫీచర్లను అందించనుంది. బజాజ్ చేతక్ 2901 స్కూటర్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 123కిలోమీటర్ల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. గరిష్టంగా గంటకు 63కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటలు సమయం పడుతుంది ఇంకా, 2901 స్కూటర్ అర్బేన్ మాదిరి ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ప్రీమియం వేరియంట్ వంటి ఆన్-బోర్డ్‌లో కాకుండా ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది. పోటీ పరంగా పరిశీలిస్తే.. బజాజ్ చేతక్ 2901 మోడల్ ఇతర పోటీదారులైన ఓలా S1, ఏథర్ రిజ్టా, టీవీఎస్ iQube కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.
0 Comments